బాలకృష్ణ పార్టీలో ఉన్నారు: బాబు

Balakrishna-Babu
హైదరాబాద్: సినీ నటుడు బాలకృష్ణ పార్టీలోనే ఉన్నారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అన్నారు. బాలకృష్ణ గతంలో కూడా సభల్లో పాల్గొన్నారని, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు హరికృష్ణ పార్టీ కోసం వాహనమే నడిపారని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ కొత్తగా వచ్చారని ఆయన చెప్పారు. పార్టీ కోసం వారు పనిచేయడంలో తప్పు లేదని ఆయన అన్నారు. పార్టీని కాపాడి ప్రజలకు సేవలు చేసేలా తీర్చిదిద్దదడం కోసం వారు పని చేయడంలో తప్పు లేదని ఆయన అన్నారు.

తన మీ కోసం యాత్ర ఈ నెల 21వ తేదీన ప్రారంభమవుతుందని ఆయన చెప్పారు. చంద్రగిరి నుంచి తన యాత్ర మొదలవుతుందని ఆయన చెప్పారు. తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్న అనంతరం తన యాత్రను ప్రారంభిస్తానని ఆయన చెప్పారు. ప్రభుత్వ అవినీతిపై ప్రజలను చైతన్యవంతులను చేయడానికి తాను మీ కోసం పేరుతో రాష్ట్రవ్యాప్త పర్యటనను చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. వేల కోట్ల రూపాయల భూములను ప్రభుత్వం అన్యాక్రాంతం చేస్తోందని ఆయన విమర్శించారు. మద్యం ద్వారా 12 వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం రాబడుతోందని ఆయన అన్నారు. ప్రజల ఆస్తులకు ట్రస్టీగా వ్యవహరించాల్సిన ప్రభుత్వం వాటిని దోచుకు తింటోందని ఆయన వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+