మే 29న రాష్ట్రంలో ఉప ఎన్నికలు
న్యూఢిల్లీ: రాష్ట్రంలో ఉప ఎన్నికల షెడ్యూల్ ను ఎన్నికల కమీషన్ బుధవారంనాడు ప్రకటించింది. మే 29వ తేదీన రాష్ట్రంలోని 18 శాసనసభా నియోజకవర్గాలకు, 4 లోకసభ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. సిట్టింగ్ శాసనసభ్యుల మృతి వల్ల ఖాళీ అయిన ఖైరతాబాద్, తెర్లాంలతో పాటు తెలంగాణ రాష్ట్ర సమితి రాజీనామాలు చేయడం వల్ల ఖాళీ అయిన తెలంగాణలోని 16 శాసనసభా నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరుగుతాయి. కాంగ్రెస్ శాసససభ్యుడు పి. జనార్దన్ రెడ్డి మృతి వల్ల ఖైరతాబాద్ స్థానం ఖాళీ అయింది. అలాగే తెలుగుదేశం శాసనసభ్యుడు మృతి చెందడం వల్ల తెర్లాం నియోజకవర్గం ఖాళీ అయింది. తెరాస రాజీనామా చేసిన నాలుగు లోకసభ స్థానాలు హన్మకొండ, వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్ లకు కూడా అదే రోజు పోలింగ్ జరుగుతుంది.
ఉప ఎన్నికలకు మే 5 నుంచి 12వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 13వ తేదీన నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. మే 15వ తేదీన అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. మే 29వ పోలింగ్ జరుగుతుంది జూన్ 1వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. తెలంగాణ ఆకాంక్ష తీవ్రతను నిరూపించడానికి తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన 16 మంది శాసనసభ్యులు, నలుగురు లోకసభ సభ్యులు రాజీనామాలు చేసి ఉప ఎన్నికలను ఆహ్వానించారు.












Click it and Unblock the Notifications