సిపియం, తెరాస నేతల అరెస్టు

హైదరాబాద్: హౌసింగ్ బోర్డు భూముల వేలాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించిన సిపియం, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకులను, కార్యకర్తలను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. భూముల వేలాన్ని తలపెట్టిన హైదరాబాదులోని గృహకల్పను ముట్టడించడానికి సిపియం, తెరాస నాయకులు, కార్యకర్తలు ప్రయత్నించారు. ఆందోళనకారుల ముట్టడిని అడ్డుకుని పోలీసులు వారిని అరెస్టు చేశారు. ఈ సమయంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

హైదరాబాదులోని 13 ఎకరాలు, ఖమ్మంలోని 11 ఎకరాల భూముల వేలాన్ని హోసింగ్ బోర్డు తలపెట్టింది. ఈ భూములను వేలం వేసి 300 కోట్ల రూపాయలు సేకరించాలని నిర్ణయించారు. అయితే ఈ వేలాన్ని అడ్డుకోవడానికి సిపియం, తెరాస కార్యకర్తలు ప్రయత్నించారు. హైదరాబాదులోని భూములను కొనడానికి మూడు ప్రధానమైన కంపెనీలు బిడ్లు వేశాయి. ఒక్కో ఎకరం 20 కోట్ల రూపాయలకు పైబడి విలువ చేస్తుందని అంటున్నారు.


Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+