కుట్రదారుడిని కాను: అమర్
కరీంనగర్: తాను కుట్రదారుడిని కానని, విప్లవకారుడినని జనశక్తి అగ్రనేత అమర్ అలియాస్ కూర దేవేందర్ అన్నారు. ఆయనను పోలీసులు గురువారంనాడు కరీంనగర్ జిల్లా సిరిసిల్లా కోర్టులో హాజరు పరిచారు. ఈ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. విప్లవ పార్టీలన్నీ ఏకం కావాలని ఆయన అభిప్రాయపడ్డారు. మార్క్సిజం, లెనినిజం, మావోయిజాలకు మరణం లేదని ఆయన అన్నారు. పోలీసులు తనను హింసించారని ఆయన అన్నారు.
అమర్ ను పోలీసులు ఈ మధ్య పూణేలో అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు ఆయనకు రిమాండ్ విధించడంతో చర్లపల్లికి జైలుకు తరలించారు. ఆ తర్వాత పోలీసులు రెండు రోజుల క్రితం తమ కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించారు. తాను లొంగిపోయినట్లు వచ్చిన వార్తలను ఆయన ఇదివరకే ఖండించారు.












Click it and Unblock the Notifications