గోదాములపై దాడి: సిపిఐ నేతల అరెస్టు
హైదరాబాద్: అధిక ధరలకు నిరసనగా సిపిఐ నాయకులు, కార్యకర్తలు శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా మార్కెట్లు, గోదాములపై దాడులు చేశారు. విశాఖపట్నంలో దాడులకు సంబంధించి సమాచారం ముందుగానే తెలుసుకున్న పోలీసులు సిపిఐ నాయకులను, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాదులో ఎల్బీనగర్ సమీపంలోని గోదాములపై సిపిఐ కార్యకర్తలు దాడులకు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. పార్లమెంటు సభ్యుడు అజీజ్ పాషాను, మరికొంత మందిని పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఆగ్రహించిన కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.
ఖమ్మంలో కూడా సిపిఐ కార్యకర్తలు గోదాములపై దాడులు చేశారు. వారిని పోలీసులు అడ్డుకోవడానికి ప్రయత్నించడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కర్నూలు జిల్లా డోన్ లో సిపిఐ కార్యకర్తలు అక్రమ నిల్వలను వెలికి తీశారు. దాదాపు 1800 టన్నుల బియ్యాన్ని వెలికి తీశారు. విజయవాడలో కూడా సిపిఐ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. టూటౌన్ లోని గోదాముపై వారు దాడి చేయడానికి ప్రయత్నించారు.












Click it and Unblock the Notifications