కాంగ్రెస్, టిడిపి చీకటి స్నేహం: కెసిఆర్

తెలంగాణను ఇస్తామని అంటున్న కాంగ్రెసుకు ఎలా ఓటేస్తారని చంద్రబాబు ఆంధ్ర ప్రాంతంలో ప్రచారం చేశారని, అయినా ఆంధ్ర ప్రాంత ప్రజలు తెలుగుదేశం పార్టీని ఓడించారని, అది ప్రజాభిప్రాయం కాదా అని ఆయన అన్నారు. కాలయాపన చేయడానికే చంద్రబాబు కమిటీలు అంటున్నారని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి కరీంనగర్ లోకసభ ఫలితం తెలంగాణకు రెఫరెండం అని చెప్పిన ముఖ్యమంత్రి మాట మార్చారని ఆయన అన్నారు. రాజశేఖర రెడ్డిని, చంద్రబాబును నమ్మడానికి వీలు లేదని ఆయన అన్నారు. తెలుగుదేశం, కాంగ్రెస్ కుట్ర చేసి ఉప ఎన్నికల్లో తెలంగాణవాదాన్ని ఓడించాలని చూస్తున్నాయని, ఈ పార్టీలు రెండు చీకటి స్నేహం చేస్తున్నాయని ఆయన దుయ్యబట్టారు. తమ పార్టీని రెండు మూడు చోట్లనైనా ఓడించి తెలంగాణవాదం లేదని ప్రచారం చేయడానికి ఈ రెండు పార్టీలు ఎత్తులు వేశాయని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications