మాహారాష్ట్రపై కోర్టు ధిక్కారం కేసు: పొన్నాల

మహారాష్ట్ర ప్రభుత్వం అత్యుత్సాహం ప్రదర్శిస్తూ 11 ప్రాజెక్టులు నిర్మిస్తోందని ఆయన అన్నారు. ఈ విషయాన్ని తాము కేంద్ర ప్రభుత్వం దృష్టికి, కేంద్ర జలవనరుల సంఘం దృష్టికి తీసుకుని వెళ్తామని ఆయన చెప్పారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి హైదరాబాదుకు పది టిఎంసిల నీటిని తరలిస్తారా అని అడిగితే అది తన పరిధిలో లేదని మెట్రోపాలిటన్ వాటర్ వర్క్స్ వాళ్లు దాన్ని చూసుకుంటున్నారని ఆయన అన్నారు. బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తోందని తెలుగుదేశం పార్టీ ఇటీవల బయటపెట్టిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications