ఉప ఎన్నికలపై డిఎస్ కసరత్తు
{image-d srinivas_18042008.jpg telugu.oneindia.com}హైదరాబాద్: తెలంగాణను కాంగ్రెస్ మోసం చేసిందనే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ శుక్రవారం పార్టీ కార్యాలయం గాంధీ భవన్ లో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులతోనూ, ఇతర ముఖ్య నాయకులతోనూ సమావేశమయ్యారు. దక్షిణ తెలంగాణలో జరిగే ఉప ఎన్నికలపై ఆయన సమీక్ష జరిపారు. అభివృద్ధి నినాదంతో ఎన్నికల్లో ప్రచారానికి దిగాలని కాంగ్రెసు యోచిస్తోంది. ఉప ఎన్నికల అభ్యర్థులను ఖరారు చేయడానికి ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డితో పాటు శ్రీనివాస్ ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ సమావేశంలో అభ్యర్థుల ఎంపికపై కూడా కసరత్తు జరిగింది.
వికారాబాదులో తెలంగాణ సెంటిమెంటు లేదని సమావేశంలో పాల్గొన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వల్ల తాము వికారాబాదులో గెలుస్తామని ఆమె అన్నారు. 2004 ఎన్నికల్లో కూడా వికారాబాదులో తెలంగాణ సెంటిమెంటు లేదని, తమ పార్టీతో పొత్తు వల్ల వికారాబాదులో తెరాస గెలిచిందని ఆమె అన్నారు. ఈ సీటు నుంచి 2004 ఎన్నికల్లో తెరాస అభ్యర్థి చంద్రశేఖర్ గెలిచారు.












Click it and Unblock the Notifications