వైయస్, బాబు తెలంగాణ రాగం

తమ ప్రభుత్వం ప్రత్యేక తెలంగాణకు వ్యతిరేకం కాదని ముఖ్యమంత్రి వైఎస్ వెల్లడించారు. తెలంగాణ అంశాన్ని పక్కన పెట్టేయలేదని దానిపై చర్చలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశం పూర్తయిన అనంతరం ఆయన మంత్రులతో మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నట్టు చెప్పారు. ఆ ప్రాంతంలో సాగునీటి పథకాలకు నిధులను విడుదల చేసే అంశాలను పరిశీలిస్తున్నట్టు తెలిపారు. తెలంగాణకు సంబంధించి పార్టీ వర్గాల్లో గందరగోళం ఏర్పడిందని ఆయన అన్నారు. అలాగే లోక్‌సభ ఎన్నికల్లో పార్టీకి తగిన మెజారిటీని సాధించేందుకు స్థానిక ఎమ్మెల్యేలు, నేతలు బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications