తొలి కాన్సెప్ట్ స్కూలుకు సిఎం శ్రీకారం

YS Rajasekhar Reddy
కడప: కాన్సెప్ట్ స్కూళ్ల ద్వారా గ్రామీణ పేదలకు ఉచిత విద్యను అందిస్తామని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి చెప్పారు. రాష్ట్రంలోనే తొలి కాన్సెప్ట్ స్కూలును ఆయన శుక్రవారం కడప జిల్లా శెట్టిగుంటలో ప్రారంభించారు. కడప జిల్లాలో ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మైదకూరులో ఆయన ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. తాము ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తున్నామని ఆయన ఈ సందర్భంగా జరిగిన సభలో చెప్పారు. తాము చేస్తున్న కార్యక్రమాలను ఆయన వివరించారు.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుపై ఆయన విమర్శలు గుప్పించారు. ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచి చంద్రబాబు అధికారంలోకి వచ్చారని ఆయన వ్యాఖ్యానించారు. రైల్వే కోడూరులో ఆయన ప్రజాపథం నిర్వహించారు. రైల్వే కోడూరుకు కృష్ణా జలాలను అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+