మేం గెలుస్తాం: బాబు ధీమా

Chandrababu Naidu
చిత్తూరు: కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు తన మీ కోసం చైతన్యయాత్రలో తీవ్రంగా ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో తాము అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం ఉదయం చంద్రగిరి దళితవాడ నుంచి ప్రారంభమైన ఆయన చైతన్యయాత్ర సాయంత్రానికి తిరుపతి చేరుకుంది. తాము అధికారంలోకి వస్తే రైతులకు 9 గంటలు ఉచితంగా విద్యుత్ ఇస్తామని, విద్యుత్ సరఫరాను 12 గంటలు కూడా ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం వల్ల ధరలు పెరుగుతున్నాయని ఆయన విమర్శించారు. కాంగ్రెసు ప్రభుత్వం సంపదను దోచుకు తింటోందని ఆయన అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో సంపద సృష్టించామని, దాన్ని కాంగ్రెస్ వారు దోచుకుతింటున్నారని ఆయన అన్నారు. చంద్రబాబుకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. తన యాత్ర మధ్యలో ఒకటి రెండు చోట్ల ఆయన ప్రజలతో మాట్లాడారు. పూరిగుడిసెల్లోని మహిళలను పలకరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+