కడియం శ్రీహరిపై బాబు గరం

కాగా, ఉప ఎన్నికలకు ఈ సాయంత్రం అభ్యర్థుల జాబితాను విడుదల చేయాల్సి ఉండగా దాన్ని పార్టీ వాయిదా వేసుకుంది. స్టేషన్ ఘనపూర్ నుంచి పోటీ చేయాల్సిన కడియం శ్రీహరి పార్టీపై విమర్శలు చేయడం తదితర సమస్యల దృష్ట్యా జాబితా విడుదలను వాయిదా వేసింది. నల్లగొండ జిల్లాకు చెందిన గుత్తా సుఖేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, ఆలేరు శాసనసభా నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి మోత్కుపల్లి నర్సింహులు విముఖత వ్యక్తం చేయడం వంటి కారణాలు జాబితా విడుదల వాయిదాకు కారణాలు. వరంగల్, హన్మకొండ పార్లమెంటు నియోజకవర్గాలకు ఇంకా అభ్యర్థులు ఖరారు లేదు.












Click it and Unblock the Notifications