బాబును కుప్పంలో ఓడిస్తాం: కిరణ్
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడిని కుప్పంలో ఓడిస్తామని, అందుకు తగిన అభ్యర్థిని తాము సిద్ధం చేశామని కాంగ్రెస్ శాసనసభ్యుడు, ప్రభుత్వ చీఫ్ విప్ కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. చంద్రగిరిలో కాంగ్రెస్ నుంచి ఒక్కసారి పోటీ చేసి గెలిచిన చంద్రబాబు అక్కడి నుంచి కుప్పం నుంచి పారిపోయారని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. చంద్రబాబు మోసానికి కాలం చెల్లిందని ఆయన అన్నారు. చంద్రబాబు రాజకీయాల నుంచి రిటైర్ కావాలని ఆయన సూచించారు.
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చంద్రబాబు ప్రజల శ్రేయస్సును పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. ఇప్పుడు అధికార దాహంతో చైతన్య యాత్రను చేపట్టారని ఆయన వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ప్రజలను మోసం చేశారని, అధికారం కోల్పోయిన తర్వాత కూడా మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. చంద్రగిరి నుంచి పోటీ చేసే ధైర్యం చంద్రబాబుకు ఉందా అని ఆయన అడిగారు.












Click it and Unblock the Notifications