చంద్రబాబు రథసారథి హరికృష్ణ

ఆదివారం ఉదయం తన స్వగ్రామం నారావారిపల్లెలో చంద్రబాబు తన జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. సోమవారం ఉదయం ఆయన తన రథయాత్రను ప్రారంభించారు. అంతకు ముందు తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సమావేశం జరిగింది. ఉప ఎన్నికల్లో పోటీ చేసే పార్టీ అభ్యర్థుల జాబితాను సోమవారం సాయంత్రం వెల్లడించే అవకాశం ఉంది. చంద్రబాబు రోజుకు 70 కిలోమీటర్లు చొప్పున వంద రోజులు రాష్ట్రంలోని 7 వేల కిలోమీటర్లు తిరుగుతారు. తొలుత ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాలో పర్యటిస్తారు. గుంటూరు జిల్లా నుంచి ఆయన నల్లగొండ జిల్లాలోకి ప్రవేశిస్తారు. ఉప ఎన్నికలు జరిగే అన్ని ప్రాంతాల్లో ఆయన పర్యటిస్తారు.












Click it and Unblock the Notifications