ఎవరేమిటో తేలుతుంది: జయశంకర్
సిద్ధిపేట: తెలంగాణలో జరుగనున్న ఉప ఎన్నికలు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల వైఖరులను తేటతెల్లం చేస్తాయని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) సిద్దాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ అన్నారు. ఉప ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాతనైనా కాంగ్రెసు వైఖరి మారుతుందేమోనని ఆశ పడుతున్నట్లు ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. తెలంగాణపై కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల వైఖరులను తేటతెల్లం చేయడానికే తెరాస ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేసి ఉప ఎన్నికలను ఆహ్వానించారని ఆయన అన్నారు.
తెలుగుదేశం పార్టీ తెలంగాణ అనుకూల వైఖరి తీసుకున్నా ప్రయోజనం ఉండదని ఆయన అన్నారు. తెలంగాణ అనుకూల వైఖరి తీసుకున్నా తెలుగుదేశం పార్టీకి ఫలితం ఉండదని ఆయన అన్నారు. కాంగ్రెస్ తెలంగాణపై నానుస్తోందని, తెలుగుదేశం వైఖరిని తీసుకోవడానికి ఊగిసలాడుతోందని, ఈ స్థితిలో తెలంగాణకు ఎవరు అనుకూలమో, ఎవరు వ్యతిరేకమో ఉప ఎన్నికల ద్వారా తేలిపోతుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications