రెండు, ముడు రోజుల్లో జాబితా: డిఎస్
{image-d srinivas_21042008.jpg telugu.oneindia.com}న్యూఢిల్లీ: రెండు, మూడు రోజుల్లో ఉప ఎన్నికలకు సంబంధించి పార్టీ అభ్యర్థుల తుది జాబితాను వెల్లడిస్తామని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ చెప్పారు. పార్టీ అభ్యర్థుల జాబితాకు పార్టీ అధిష్ఠానవర్గం ఆమోదం లభించగానే వెల్లడిస్తామని ఆయన చెప్పారు. అభ్యర్థుల జాబితాను అధిష్ఠాన వర్గం ఆమోదింపజేసుకోవడానికి ఆయన ఆదివారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్నారు. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి సోమవారం ఉదయం ఢిల్లీకి చేరుకున్నారు.
అభ్యర్థుల జాబితాపై చర్చకు శ్రీనివాస్, వైయస్ రాజశేఖర రెడ్డి రెండు దఫాలు సమావేశమై చర్చలు జరిపారు. ఇద్దరు కలిసి కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్పమొయిలీతో సమావేశమయ్యారు. అభ్యర్థుల జాబితాపై వారు వీరప్ప మొయిలీతో చర్చించారు. అనంతరం ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి కేంద్ర మంత్రి ప్రియరంజన్ దాస్ మున్షీతో సమావేశమయ్యారు.












Click it and Unblock the Notifications