దేశంలో 3.7 కోట్ల బోగస్ రేషన్‌కార్డులు: పవార్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 3.7 కోట్ల బోగస్ రేషన్‌కార్డులు ఉన్నాయని వ్యవసాయ మంత్రి శరద్ పవార్ తెలిపారు. దేశంలోని 3.7 కోట్ల అనర్హ కుటుంబాలకు రేషన్ కార్డులు అందాయని ఆయన చెప్పారు.
దీనికి సంబంధించి ఆయన లోక్‌సభలో వివరించారు. దేశంలో వివిధ రాష్ట్రాలలో 10.28 కోట్ల కుటుంబాలకు రేషన్ కార్డులను పంపిణీ చేశాయని, వాటిలో 6.52 కోట్ల కుటుంబాలు మాత్రమే దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్నాయని పవార్ తెలిపారు.
ఈ సంఖ్యకన్నా అధికంగా ఉన్న కార్డులను బోగస్ కార్డులుగా గుర్తించామని వెల్లడించారు. ఈ విషయాలను ఆయా రాష్ట్రాలకు తెలిపామన్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాలు ఆ కార్డుల తొలగింపు కార్యక్రమాన్ని ప్రారంభించాయని అన్నారు.












Click it and Unblock the Notifications