అభ్యర్థుల జాబితా రెడీ: మొయిలీ
న్యూఢిల్లీ: ఉప ఎన్నికల్లో పోటీ చేసే పార్టీ అభ్యర్థుల జాబితాను ఈ సాయంత్రం విడుదల చేస్తామని కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ చెప్పారు. ఒకటి, రెండు నియోజకవర్గాలకు మినహా అన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లు ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి, పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్ లతో కలిసి వీరప్ప మొయిలీ మంగళవారం ఉదయం తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసి తుది జాబితాపై కసరత్తు చేశారు.
గత రెండు రోజులుగా ఢిల్లీలో అభ్యర్థుల జాబితాపై కసరత్తు జరుగుతోంది. ఉప ఎన్నికలు తెలంగాణకు గానీ, ప్రభుత్వం పనితీరుకు గానీ రెఫరెండం కాదని పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్ అన్నారు. నాలుగు నియోజకవర్గాలపై సందిగ్ధత నెలకొన్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications