హన్మకొండకు సురేఖ: తెర్లాం టిడిపికి
న్యూఢిల్లీ: వచ్చే ఉప ఎన్నికలకు కాంగ్రెస్ తన అభ్యర్థుల తొలి జాబితాను వెల్లడించింది. తెర్లాం, ఖైరతాబాద్ శాసనసభా నియోజకవర్గాలను తెలుగుదేశం పార్టీతో ఏకగ్రీవం చేసుకునేందుకు ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ అంగీకరించారు. దీంతో విజయనగరం జిల్లా తెర్లాంను కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీకి వదిలిపెట్టాలని నిర్ణయించింది. తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు మరణించడం వల్ల ఈ స్థానం ఖాళీ అయింది. దీంతో ఖైరతాబాద్ నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీ కాంగ్రెసుకు వదిలిపెట్టాల్సి ఉంటుంది.
కాంగ్రెస్ శాసనసభ్యుడు పి. జనార్దన్ రెడ్డి మృతి వల్ల ఖైరతాబాద్ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతోంది. ఈ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా జనార్దన్ రెడ్డి కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి పేరు ఖరారు అయింది. ఇక ఉప ఎన్నికలు జరుగుతున్న నాలుగు లోకసభ స్థానాల్లో మూడు లోకసభ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ఖరారు చేసింది. హన్మకొండ నియోజకవర్గానికి శాసనసభ్యురాలు సురేఖ పేరును, కరీంనగర్ స్థానానికి మంత్రి జీవన్ రెడ్డి పేరును, ఆదిలాబాద్ స్థానానికి శాసనసభ్యుడు ఇంద్రకరణ్ రెడ్డి పేరును పార్టీ ఖరారు చేసింది. వరంగల్ లోకసభ స్థానానికి అభ్యర్థిని ఖరారు చేయాల్సి ఉంది.












Click it and Unblock the Notifications