శ్రీహరి వ్యవహారంపై దుష్ప్రచారం: దేవేందర్

Devender Goud
హైదరాబాద్: తమ పార్టీ నాయకుడు కడియం శ్రీహరి విషయంలో దుష్ప్రచారం జరుగుతోందని తెలుగుదేశం పార్టీ నాయకుడు టి. దేవేందర్ గౌడ్ అన్నారు. స్టేషన్ ఘనపూర్ నుంచి కడియం శ్రీహరి పోటీ చేస్తారని, శ్రీహరే తమ పార్టీ అభ్యర్థి అని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణపై అన్ని పార్టీల్లో చర్చ జరుగుతోందని, అలాగే తమ పార్టీలో కూడా జరుగుతోందని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీలో చర్చ జరిగితే అంత రాద్ధాంతం ఎందుకని ఆయన అడిగారు. తన నియోజకవర్గంలోని ప్రజల అభిప్రాయాలను బట్టి కడియం శ్రీహరి తెలంగాణపై ఆ విధంగా మాట్లాడి ఉంటారని, అందులో తప్పేమీ లేదని ఆయన అన్నారు. తాను కడియం శ్రీహరితో మాట్లాడానని, శ్రీహరి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన చెప్పారు.

కాంగ్రెసుతో అంతర్గత అవగాహన ఏదీ లేదని, నాలుగేళ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణకు మునుపెన్నడూ జరగనంత అన్యాయం జరిగిందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితితో తాము కలిసే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్, తెరాస రెండూ ఒక్కటేనని, రెండు కలిసే నాటకం ఆడుతున్నాయని ఆయన అన్నారు. ఉప ఎన్నికల్లో తమకూ తెరాసకు మధ్యనే పోటీ ఉంటుందని ఆయన చెప్పారు. ఒక ఎల్లారెడ్డి నియోజకవర్గానికి తప్ప మిగతా నియోజకవర్గాలన్నింటికీ అభ్యర్థులను ఖరారు చేశామని ఆయన చెప్పారు. వామపక్షాలతో పొత్తు ఉంటుందని, వామపక్షాలతో మాట్లాడుతున్నామని, వామపక్షాలకు మూడు సీట్లు ఇస్తామని ఆయన చెప్పారు.

కడియం శ్రీహరి విషయంలో కొందరు అయోమయానికి గురి చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు. శ్రీహరి మాటలకు పెడర్థాలు తీస్తున్నారని ఆయన చెప్పారు. తెలంగాణపై తమ కమిటీ త్వరలో నివేదిక సమర్పిస్తుందని ఆయన చెప్పారు. అన్ని పార్టీల్లోనూ భిన్నాభిప్రాయాలుంటాయని, కీలకమైవ అంశాలపై అభిప్రాయాలు వెల్లడించే సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుందని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+