బాబువి కక్కుర్తి రాజకీయాలు: మంత్రులు
హైదరాబాద్: తాము అధికారంలోకి వస్తే 12 గంటల పాటు రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీపై రాష్ట్ర మంత్రులు కె.రోశయ్య, షబ్బీర్ అలీ తీవ్రంగా ధ్వజమెత్తారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఉచిత విద్యుత్ ఇవ్వడం సాధ్యం కాదన్న చంద్రబాబు అధికారంలోకి రావడానికి ఆ హామీ ఇస్తున్నారని వారు మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. రైతులకు 12 గంటల పాటు ఉచిత విద్యుత్ ఇవ్వడం ఎలా సాధ్యమో లెక్కలతో వివరించాలని వారు చంద్రబాబును డిమాండ్ చేశారు.
చంద్రబాబు అధికారం కోసం కక్కుర్తి రాజకీయాలు చేస్తున్నారని వారన్నారు. చంద్రబాబు మనసులో మాటను కాదని ఉచిత విద్యత్తు ఇస్తామని హామీ ఇస్తున్నారని వారన్నారు. తన అధికారంలో రైతులను జైల్లో పెట్టిన చంద్రబాబు ఇప్పుడు ఉచిత విద్యుత్ ఇస్తామని మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారని వారన్నారు. లక్షకు పైగా ఉన్న విద్యుత్ గృహ వినియోగం కేసులను ఎత్తివేస్తున్నట్లు విద్యుచ్చక్తి మంత్రి షబ్బీర్ అలీ చెప్పారు.












Click it and Unblock the Notifications