కెసిఆర్ దొరకలేదు: డిఎస్
{image-d srinivas_24042008.jpg telugu.oneindia.com}హైదరాబాద్: ఖైరతాబాద్ శాసనసభా నియోజకవర్గంలో తాను తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావుతో మాట్లాడడానికి ప్రయత్నించానని, అయితే చంద్రశేఖర రావు అందుబాటులో లేరని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ చెప్పారు. తాను తెరాస నాయకులు హరీష్ రావు, దిలీప్ కుమార్ లతో మాట్లాడానని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో చెప్పారు.
దివంగత శాసనసభ్యుడు పి. జనార్దన్ రెడ్డి కుమారుడు, ఖైరతాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విష్ణువర్దన్ రెడ్డి కూడా చంద్రశేఖరరావును కలిసేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆయన చెప్పారు. ఖైరతాబాద్ ఏకగ్రీవమే అవుతుందని, తెరాస ఖైరతాబాదులో పోటీ చేస్తుందని అనుకోవడం లేదని ఆయన అన్నారు. పార్టీ తెలంగాణ సీనియర్లతో శ్రీనివాస్ చర్చలు జరిపారు. వారికి ఉప ఎన్నికల బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications
