టిడిపితో తెరాస కుమ్మక్కు: జీవన్ రెడ్డి
హైదరాబాద్: ఉప ఎన్నికల కోసం తెలుగుదేశం పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) రహస్య ఒప్పందం కుదుర్చున్నాయని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి టి. జీవన్ రెడ్డి విమర్శించారు. కరీంనగర్ లోకసభ కాంగ్రెస్ అభ్యర్థిగా ఎంపికైన జీవన్ రెడ్డి గురువారంనాడు ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డిని కలిశారు. తాను మంత్రి పదవికి రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేస్తానని ఆయన చెప్పారు. కెసిఆర్ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు తెలంగాణ నినాదం ముసుగు వేసుకున్నారని, ఈ ముసుగు తొలగించి కెసిఆర్ వికృత రూపాన్ని ప్రజలకు చూపిస్తామని ఆయన అన్నారు.
ఉప ఎన్నికల్లో తమ పార్టీ మెజారిటీ సీట్లు గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కరీంనగర్ ఎన్నికలో తాను గెలుస్తానని ఆయన చెప్పుకున్నారు. తమకు సేవ చేయాలని కెసిఆర్ ను కరీంనగర్ ప్రజలు రెండు సార్లు ఎన్నుకున్నారని, అయితే కెసిఆర్ కనీసం ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన పాపాన కూడా పోలేదని ఆయన అన్నారు. తెలంగాణ నినాదంతో ఉప ఎన్నికలకు సంబంధం లేదని ఆయన చెప్పారు. గత కరీంనగర్ ఉప ఎన్నికలో జీవన్ రెడ్డి తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుపై పోటీ చేసి ఒడిపోయారు. ఆ తర్వాతే ఆయనకు మంత్రి పదవి దక్కింది.












Click it and Unblock the Notifications
