అణు ఒప్పందంపై అభిప్రాయం: ప్రణభ్

అణు ఒప్పందంలోని మూడంచెల ప్రక్రియ పూర్యయ్యాక పార్లమెంట్ అభిప్రాయాన్ని కోరతామని తెలిపారు. మొదటి ప్రక్రియ 123 ఒప్పందం. దీనిని అమెరికా, భారత్ ఇప్పటికే పూర్తి చేశాయి. రెండో దశలో అంతర్జాతీయ అణు శక్తి సంస్థతో భద్రతా చర్యల ఒప్పందం కుదుర్చుకోవాలి. ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉందని ప్రణబ్ వెల్లడించారు.
మూడో దశలో అణు ఇంధన సరఫరా దేశాలతో చర్చల ద్వారా మార్గదర్శకాలు సవరించడమని ప్రణబ్ తెలిపారు. ఈ మూడు దశలు పూర్తయిన అనంతరం అణు ఒప్పందంపై పార్లమెంట్ అభిప్రాయాన్ని కోరతామని అన్నారు.
ఈ ఒప్పందాన్ని పార్లమెంట్‌లో ప్రవేశపెడితే మెజారిటీ సభ్యులు దీనిని సమర్థిస్తారని తాను చెప్పడం లేదన్నారు. ఒప్పందం అమల్లోకి వస్తేనే దాని ప్రయోజనాలు తెలుస్తాయని చెప్పారు. ఈ ఒప్పందం వలన భారత స్వతంత్ర విదేశాంగ విధానానికి ముప్పేమీ లేదని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications
