ఢిల్లీకి వైయస్ చక్కర్లు: బాబు

తెలంగాణ ఉప ఎన్నికల్లో తమ పార్టీ గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల్లో తమ పార్టీకి విశ్వసనీయత ఉందని ఆయన చెప్పారు. తెలంగాణపై తాము వేసిన ఐదుగురు సభ్యుల కమిటీ నివేదిక ఇవ్వగానే తగిన నిర్ణయం తీసుకుంటామని ఆయన ఒక ప్రైవేట్ తెలుగు టీవీ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆయన విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ పథకం లోపభూయిష్టంగా ఉందని ఆయన అన్నారు. తాము అధికారంలోకి వస్తే రైతుల రుణాలను అన్నింటినీ రద్దు చేస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
