విష్ణు ఏకగ్రీవానికి సహకారం: సిపిఎం
హైదరాబాద్: హైదరాబాదులోని ఖైరతాబాద్ శాసనసభా నియోజకవర్గం నుంచి దివంగత శాసనసభ్యుడు పి. జనార్దన్ రెడ్డి కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నికకు సహకరించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బి.వి. రాఘవులు అన్ని పార్టీలను కోరారు. మానవతా దృక్పథంతో ఆలోచించి ఖైరతాబాద్ ఎన్నిక ఏకగ్రీవం చేయాల్సిన అవసరం ఉందని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.
తాము ముషిరాబాద్, చేర్యాల శాసనసభా నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తామని, అభ్యర్థులను త్వరలోనే ప్రకటిస్తామని ఆయన చెప్పారు. తమ అభ్యర్థులను ఈ నియోజకవర్గాల్లో బలపరచాలని తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ స్థితిలో మిగతా చోట్ల తెలుగుదేశం పార్టీని బలపరిచే విషయమై ఈ నెల 27వ తేదీన సిపిఐతో జరిగే సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
