మళ్లీ పెరిగిన ద్రవ్యోల్బణం
న్యూఢిల్లీ: ప్రభుత్వం చేపట్టిన నియంత్రణ చర్యలకు ఇంతకుముందు వారం తగ్గుముఖం పట్టినట్టుగా కనిపించిన ద్రవ్యోల్బణం ఏప్రిల్ 12తో ముగిసిన వారాంతానికి మళ్లీ పెరిగింది. అంతకుముందు 7.14 శాతం వద్ద ఉన్న ద్రవ్యోల్బణం ఈసారి 7.33 శాతానికి చేరింది. ఆహార ఉత్పత్తులు ధరల పెరుగుదల ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపింది. ద్రవ్యోల్బణం పెరుగుదల ఈ నెల 29న రిజర్వు బ్యాంకు ప్రకటించే వార్షిక ద్రవ్య- పరపతి విధానంపై కూడా ప్రభావం చూపే అవకాశాలున్నాయి.
ద్రవ్య సరఫరాను నియంత్రించేందుకు ఇప్పటికే రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్)ని అర శాతం పెంచిన సంగతి. ఈ సీఆర్ఆర్ పెంపు రెండు విడతలుగా (ఈ నెల 26, వచ్చే నెల 10 తేదీల్లో) అమల్లోకి వస్తుంది. 40 నెలల గరిష్ట స్థాయి 7.41 శాతం నుంచి ఏప్రిల్ 5వ తేదీతో ముగిసిన వారాంతానికి ద్రవ్యోల్బణం 7.14 శాతానికి తగ్గింది. దీనిని మరింత తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం అనంతరం మరిన్ని చర్యలు చేపట్టినప్పటికీ ద్రవ్యోల్బణం ఏఫ్రిల్ 12 వారాంతానికి 0.19 శాతం మేర పెరిగి 7.33 శాతానికి చేరుకుంది.












Click it and Unblock the Notifications
