విష్ణు ఆశలపై జెపి నీళ్లు
హైదరాబాద్: తన తండ్రి దివంగత పి. జనార్దన్ రెడ్డి కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి ఆశలపై లోకసత్తా నేత జయప్రకాశ్ నారాయణ కూడా నీళ్లు చల్లారు. ఖైరతాబాద్ సీటు నుంచి పోటీ లేకుండా ఏకగ్రీవంగా శాసనసభకు ఎన్నిక కావాలనుకున్న విష్ణుకు తెలంగాణ రాష్ట్ర సమితి గొళ్లెం పెట్టగా తాము ఖైరతాబాదులో పోటీ చేస్తామని జయప్రకాశ్ నారాయణ్ చెప్పారు. ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు సహకరించాలని విష్ణు జయప్రకాశ్ నారాయణను కలిసి విజ్ఞప్తి చేశారు. విష్ణు విజ్ఞప్తిని జయప్రకాశ్ నారాయణ తోసి పుచ్చారు.
తాము వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకమని, కుటుంబ వారసత్వ రాజకీయాలను అడ్డుకుంటామని, అందుకు గాను తాము ఏకగ్రీవ ఎన్నికకు సహకరించబోమని ఆయన విష్ణుకు కచ్చితంగా చెప్పేశారు. తెర్లాం, ఖైరతాబాదులను ఏకగ్రీవం చేసుకోవడానికి తెలుగుదేశం పార్టీతో సహకరించుకోవాలని కాంగ్రెసు పార్టీ నిర్ణయించింది. అయితే మారిన వాతావరణంలో తాము ఖైరతాబాదులో పోటీ చేస్తామని తెరాస తేల్చి చెప్పింది. దీంతో విష్ణుకు ఖైరతాబాదులో పోటీ తప్పేట్లు లేదు.












Click it and Unblock the Notifications
