రోడ్డు ప్రమాదాల్లో 9 మంది మృతి
హైదరాబాద్: మహబూబ్ నగర్, నల్లగొండ జిల్లాల్లో శుక్రవారం ఉదయం జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో 9 మంది మృతి చెందారు. మహబూబ్ నగర్ లోని టీబీ ఆస్పత్రిగా ఎదురెదురుగా వస్తున్న లారీ, ఆటో ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. మరొకరు గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మరణించగా, మరో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందతూ మరణించారు. వీరంతా కూలీలే. అప్పనపల్లి నుంచి వీరు జడ్చర్లకు ఆటోలో వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది.
నల్లగొండ జిల్లా సూర్యాపేట మండలం టేకుమట్ల వద్ద గల వంతెన మీద జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మరణించారు. లారీ ఎదురుగా వస్తున్న కారును ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. స్వర్ణకుమారి అనే మహిళ అమెరికా నుంచి వచ్చి కారులో స్వగ్రామం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో స్వర్ణకుమారి మరణించింది. లారీ డ్రైవర్ కూడా మృతి చెందాడు.












Click it and Unblock the Notifications
