తెలుగు సినిమాలో శ్రీశాంత్?

శ్రీశాంత్ 15 రోజుల కాల్షీట్లు ఇస్తే చాలునని ఒక తెలుగు నిర్మాత అడిగాడట. ఐపియల్ మ్యాచుల్లో బిజీగా ఉన్న శ్రీశాంత్ ఈ మ్యాచులు ముగిసిన వెంటనే కాల్షీట్లు ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నట్లు చెబుతున్నారు. కేరళకు చెందిన ఈ యువ ఫాస్ట్ బౌలర్ బ్రేక్, షేక్ డ్యాన్సుల్లో ఆరితేరినవాడని ఇప్పటికే క్రికెట్ అభిమానులకు తెలిసిపోయింది. ఇటీవల అతను బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రాతో కలిసి ఒక యాడ్ ఫిల్మ్ లో నటించాడు. వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించి మోసులు వేసినట్లు ఆ సమయంలో ప్రచారం కూడా జరిగింది. అయితే ఆ విషయాన్ని ప్రియాంక చోప్రా ఖండించింది. ఈ సమయంలో శ్రీశాంత్ చేసిన ఒక ప్రకటన బాలీవుడ్ భామలను ఆగ్రహానికి కూడా గురి చేసింది. సినిమా యాక్టర్లే క్రికెటర్ల వెంట పడుతున్నారని అతను చేసిన ప్రకటనపై ఒక బాలీవుడ్ నటి బహిరంగంగానే విమర్శలు గుప్పించింది.












Click it and Unblock the Notifications
