విజయనగరం: దమ్ముంటే ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావును సవాల్ చేశారు. కెసిఆర్ వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం లేదని ఆయన శుక్రవారం తన విజయనగరం జిల్లా పర్యటనలో అన్నారు. తెలంగాణ ప్రజలు కెసిఆర్ కు తగిన బుద్ధి చెప్తారని ఆయన అన్నారు.
ఖైరతాబాదులో పోటీ చేస్తే మిగతా 16 సీట్లలో తెరాస గల్లంతవుతుందని ఆయన అన్నారు. తెలంగాణ సెంటిమెంటు ఎవరి సొత్తూ కాదని ఆయన అన్నారు. రాజకీయం నెంబర్ గేమ్ అని, సంఖ్యాబలం పెంచుకుంటూ ముందుకు పోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు.