నెల్లూరు : ధరలు తగ్గించలేకుంటే గద్దె దిగాలని టీడీపీ చీఫ్ చంద్రబాబు ధ్వజమెత్తారు. నిత్యావసర వస్తువుల ధరలను అదుపు చేయలేకపోవడం ద్వారా ప్రజల నడ్డి విరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మీకోసం యాత్రలో భాగంగా ఆయన నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో శుక్రవారం పర్యటించిన ఆయన పలు చోట్ల ప్రజల మధ్య ప్రసంగించారు. ధరల పెరుగుదలతో రూ. కేజీకే బియ్యం అందించినా ప్రయోజనం కన్పించడం లేదన్నారు. రాష్ట్రంలో డెబ్బై వేలకు పైగా బెల్టుషాపులు ఉన్నా ఆదాయానికి గండి పడరాదనే ప్రభుత్వం దానిని చూస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే ఆ బెల్టు షాపులను ఎత్తివేస్తామన్నారు.