తెరాసను బలపరచం: సిపిఐ
కరీంనగర్: తాము తెలంగాణకు అనుకూలమే అయినా ఉప ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)ని బలపరిచేది లేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ స్పష్టం చేశారు. తెరాస తీరు తమకు ఆమోదయోగ్యంగా లేదని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తెరాస రాజకీయ విధానాలు, వాడుతున్న భాష, వ్యవహారశైలి బాగా లేవని ఆయన అన్నారు.
వామపక్షాలు కలిసి ఉండాలనేదే తమ ఉద్దేశ్యమని ఆయన చెప్పారు. అయితే తెలుగుదేశం పార్టీతో ఉప ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవాలనే సిపిఎం విధానం సరైంది కాదని ఆయన అన్నారు. రాష్ట్రంలో వామపక్ష ప్రజాతంత్ర ఐక్య కూటమి దిశలో వామపక్షాలు కృషి చేయడం అవసరమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications