దర్శక రత్నగానే ఉంటా: దాసరి
{image-dasari narayana_05052008.jpg telugu.oneindia.com}హైదరాబాద్: ఊపిరి ఉన్నంత వరకు దర్శకరత్పగానే ఉంటానని ప్రముఖ సినీ దర్శకుడు, మాజీ కేంద్ర మంత్రి దాసరి నారాయణరావు చెప్పారు. కుటుంబ సభ్యులు, అభిమానుల మధ్య ఆయన ఆదివారం తన 62వ జన్మ దినోత్సవాన్ని జరుపుకున్నారు. రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు ఆయనకు జన్మ దిన శుభాకాంక్షలు తెలియజేశారు. సినిమా రంగాన్ని వదిలి రాజకీయాల్లోకి వెళ్లి తప్పు చేశానని ఆయన అన్నారు. ఇక సినిమా రంగానికే తన జీవితాన్ని అంకితం చేస్తానని ఆయన చెప్పారు.
తన జీవితం పథకం ప్రకారం సాగలేదని, ఏదో కావాలని ఏదో అయ్యానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇక సినిమాలపైనే తాను దృష్టి పెడతానని, నాలుగేళ్లు సినీ రంగానికి దూరం కావడం బాధగా ఉందని ఆయన అన్నారు. తన జీవితంలోని చివరి రోజు వరకు సినీ దర్శకుడిగానే ఉంటానని ఆయన చెప్పారు. కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసినప్పటి నుంచి ఆయన పార్లమెంటుకు హాజరు కావడం లేదు.












Click it and Unblock the Notifications
