యువతిపై వృద్ధుడి అత్యాచార యత్నం
విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా తాటిచెట్లపాలెంలో 20 ఏళ్ల యువతిపై 75 ఏళ్ల వృద్ధుడు అత్యాచార యత్నం చేశాడు. జ్యోతి అనే ఆ యువతిపై 75 ఏళ్ల వృద్ధుడు అత్యాచార యత్నం చేయడమే కాకుండా ప్రతిఘటించడంతో కత్తితో దాడి చేశాడు. తనను పెళ్లి చేసుకోవాలని శంకర్ జ్యోతిపై ఒత్తిడి తెచ్చాడు. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడు.
జ్యోతి అస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. నెలరోజుల క్రితం జ్యోతి తన అమ్మమ్మ ఇంటికి వచ్చింది. నెల రోజుల క్రితం అమ్మమ్మ చనిపోయింది. దీంతో పరామర్శించే నెపంతో శంకర్ జ్యోతి ఇంటికి వచ్చాడు. ఈ సమయంలో ఆమెపై ఘాతుకానికి యత్నించాడు.












Click it and Unblock the Notifications
