చంద్రమోహన్ బేషరతు క్షమాపణ

{image-chandra mohan_09052008.jpg telugu.oneindia.com}హైదరాబాద్: తెలుగు సినీ పరిశ్రమకు ప్రముఖ సినీ నటుడు చంద్రమోహన్ బేషరతు క్షమాపణ చెప్పారు. గోల్డ్ క్వెస్ట్ వ్యవహారంపై మాట్లాడుతూ సినీ పరిశ్రమలో దొంగలున్నారని చంద్రమోహన్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యపై తెలుగు సినిమా నిర్మాతల మండలి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తన మాటలు ఎవరికైనా బాధ కలిగించి ఉంటే క్షమాపణ చెబుతున్నానని ఆయన శుక్రవారంనాడు అన్నారు.

శోభన్ బాబు తరహాలో సినీ పరిశ్రమ నుంచి తప్పుకోవాలని తనకు ఉందని ఆయన అన్నారు. గోల్డ్ క్వెస్ట్ హిమాయత్ నగర్ శాఖ కార్యాలయంతో చంద్రమోహన్ భార్య జలంధరకు పాత్రకు ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. గోల్డ్ క్వెస్టుపై చంద్రమోహన్ ప్రశంసల జల్లు కురిపించడానికి కూడా ఇదే కారణమని అన్నారు. తనను గోల్డ్ క్వెస్ట్ వివాదంలోకి లాగవద్దని ఆయన కోరారు. సినీ పరిశ్రమ నుంచి గౌరవంగా తప్పుకోవాలని ఉందని ఆయన చెప్పారు. సినీ పరిశ్రమ తల్లిలాంటిదని ఆయన అన్నారు. అకారణంగా సినీ పరిశ్రమను నిందించడం తప్పేనని ఆయన అన్నారు. యాంత్రికంగా జరిగిన సంఘటనను పట్టించుకోవద్దని, ఇంతటితో వివాదాన్ని ముగించాలని మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ కోరింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+