చిరంజీవి పార్టీపై వైయస్ అంచనాలు

చిరంజీవి పార్టీ వల్ల తెలుగుదేశం పార్టీ ఎక్కువ నష్టపోతుందని ఆయన అన్నట్లు సమాచారం. తాము అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల వల్ల ప్రజల్లో వ్యతిరేకత లేదని, గతంలో కన్నా కాంగ్రెసుకు ప్రజామద్దతు పెరిగిందని ఆయన అన్నట్లు సమాచారం. తమకు సిపిఐ, సిపిఎం, తెలంగాణ రాష్ట్ర సమితి దూరమైనా కాంగ్రెసుకు నష్టం లేదని, గతంలో కన్నా మెరుగ్గా ఉన్నామని ఆయన చెప్పారట. ఉప ఎన్నికల్లో మంత్రులు బాధ్యతగా వ్యవహరించి కాంగ్రెసును గెలిపించాలని ఆయన సూచించారు. అధిక ధరలపై మంత్రివర్గం చర్చించింది. ధరల అదుపునకు బ్లాక్ మార్కెట్ ను అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది.












Click it and Unblock the Notifications
