ఎక్సైజ్ సీఐకి 10 కోట్ల ఆస్తులు
హైదరాబాద్: హైదరాబాద్ సంజీవరెడ్డి నగర్ లో ఉండే ఎక్సైజ్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ పట్ట్టోళ్ళ సురేందర్ రెడ్డి ఇంటిపై ఎసిబి అధికారులు దాడి చేసి దాదాపు 10 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. సురేందర్ రెడ్డి ప్రస్తుతం మహబూబ్ నగర్ జిల్లా కొడంగల్ ఎక్సైజ్ ఇన్ స్పెక్టర్ గా పనిచేస్తున్నారు. ఆయనకు ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఫిర్యాదుల మేరకు ఎసిబి అధికారులు ఆయన నివాసాల మీద, సమీప బంధువుల ఇళ్ళ మీద దాడులు చేశారు. మదీనా గుడ, అల్వాల్ , సంజీవరెడ్డి నగర్ ప్రాంతాల్లోని ప్లాట్ల డాక్యుమెంట్లు, అనేక బ్యాంకుల పాస్ పుస్తకాలు, భూముల డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆయన రెండు కార్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆయన ఆస్తుల విలువ మార్కెట్ ధర ప్రకారం 10 కోట్ల రూపాయల వరక్ ఉంటుందని అంచనా.












Click it and Unblock the Notifications