తిరుపతి: వేసవి సెలవుల కారణంగా తిరుమలలో రద్దీ బాగా పెరిగింది. పైగా వారాంతం కావడంతో ఆంధ్రప్రదేశ్ నుంచే గాక తమిళనాడు, కర్నాటక నుంచి భక్తుల రద్దీ అధికంగా ఉంది. శుక్రవారం నాడు స్వామి వారిని దాదాపు 50 వేల మంది భక్తులౌ దర్శించుకున్నారు.
శనివారం కావడంతో ఈ రోజు ఆ రద్దీ మరింత పెరిగింది. స్వామి వారి ఉచిత దర్శనానికి 15 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నేడు, రేపు స్వామి వారికి ప్రత్యేక సేవలు లేవు. అర్చన, తోమాల సేవలు ఏకాంతంగా జరుగుతున్నాయి.