ధక్షిణాసియాలో శాంతి భారత్ లక్ష్యం: మన్మోహన్ సింగ్
ధింపూ,మే 17: "ప్రజాస్వామ్యమంటే కేవలం ఎన్నికలు నిర్వహించడం మాత్రమే కాదు, దానికి ఓర్పుగా ఉండడానికై ధీర్ఘకాల ధృఢ సంకల్పం అవసరమని, అన్ని అధికారాలు, నిధులు ప్రజాక్షేమానికే ఉపయోగించాలని" రెండు రోజుల భూటాన్ సందర్శనలో భాగంగా భూటాన్ పార్లమెంటు ఉభయ సభల సమావేశంలో ప్రసంగిస్తూ భారత ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ అన్నారు. ఈమద్యే ప్రజాస్వామ్య రాచరిక దేశంగా మారిన భూటాన్ ని ప్రధాని మన్మోహన్ సింగ్ సందర్శించారు. ప్రజాస్వామ్య దిశగా భూటాన్ ప్రస్దానాన్ని, భారత్ తో వారి సంబంధాల్ని ప్రధాని మన్మోహన్ ప్రశంసించారు. ''అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ది' అనేది రాబోయే రోజుల్లో ఇరు దేశాలు ఎదుర్కోబోయే సమస్య" అని మన్మోహన్ సింగ్ అన్నారు. దాదాపుగా 70 మంది సభ్యులు ఉన్న భూటాన్ పార్లమెంటు ఉభయ సభల సమావేశంలో ప్రసంగిస్తూ భూటాన్ ప్రజలు శమించే తత్వమున్న వారని, వారికి దేవుడు అత్యంత ప్రతిభావంతుడైన నాయకుడినిచ్చాడని ఆయన అన్నారు.
"భూటాన్ ఒకవైపు తన సంస్కృతిని, పర్యావరణానికి అత్యంత ప్రాముఖ్యతనిస్తూనే మరో వైపు పారిశ్రామికంగా అభివృద్ది సాధించారు. ఈ విషయంలో భారత్ వారినుండి నేర్చుకోవాలసింది ఎంతోఉంది. ఇండో-భూటాన్ సహకారం ఇరుదేశాల అన్నిరకాలుగా పటిష్టపడటానికి ఉపయోగపడతాయి. ఆర్దిక వ్యూహాలు కొత్త ఉపాధిమార్గాల్ని సృష్టించే వింధంగా ఉండాలి, మానవ వనరుల అభివృధ్ది పై ఇరు దేశాలు ఎక్కవ పెట్టుబడులు పెట్టాలి. భారతీయ మార్కెట్ భూటాన్ వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాలకి చాలా అవకాశాలు కల్పించింది. ఇరుదేశాల మధ్య సత్సంబంధాలు, నేరుగా రాకపోకల గురించి ప్రస్తావిస్తూ మన సరిహద్దులు పరస్పర అభివృద్ది మార్గాలుగా మారాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. నీటి కొరత, శక్తి ఉత్పాదన, పర్యావరణ సమగ్రత, ఇతర విషయాల్లో పరస్పర సహకారానికి ఇరుదేశాలు భౌగోళికంగా అనువైన స్దానాల్లో ఉన్నాయి. రాబోయే పదో పంచవర్ష ప్రణాళిక భూటాన్ అభివృద్దికి, దాని భవిష్యత్ లక్ష్యానికి తోడ్పడేలా రూపొందుతుంది. భూటాన్ రాజ్యాంగ సంస్ధలన్నింటితో న్యూడిల్లీ సంస్దాగత సంబంధాలకై చూస్తుందని, పార్లమెంట్ అభివృద్దికై భూటాన్ కు అన్నిరకాల సహకారాన్ని అందించడానికి భారత్ సిధ్దమని హైడ్రో పవర్ అభివృద్దికి అత్యంత ఆవశ్యక విషయాల గూర్చి ప్రస్తావిస్తూ భారత్ 'పునాట్సాంగ్చు-II' , 'మాంగ్డెచ్చు' మెగా హైడ్రో పవర్ ప్రాజెక్టులను అభివృద్ది పరుస్తుందని అన్నారు. నాలుగు కొత్త ప్రాజెక్టులు 2020 సంవత్సరానికల్లా పర్యావరణానానికి ఎలాంటి హాని జరగకుండా 5,000 ల మెగా వాట్ల విధ్యుత్తును ఎగుమతి చేసేలా న్యూడిల్లీ విశదంగా ప్రాజెక్టు నివేదికను (డిపిఆర్) తయారీని ప్రారంభిస్తుంది.భారత్, భూటాన్ ల మధ్య 'హశమ్మరా' ను 'పుయెన్షోలింగ్' లను కలుపుతూ మొట్ట మొదటి రైలుమార్గం 'గోల్డెన్ జూబిలీ రైల్ లైన్' ని భారత్ నిర్మంచబోతుందని" ప్రధాని అన్నారు. ధక్షిణాసియాలో అంతర్గతంగా ప్రశాంతంగా ఉండటమే తమ లక్ష్యం అని, మన ప్రాంతంలో రక్షణ, శాంతి, అభివృద్దికి భారత్ సహకరిస్తుందని, ప్రాంతీయ, ద్వైపాక్షిక విషయాల్లో భూటాన్ తో కలసి పనిచేయాలని భారత్ అభిలషిస్తుంది. భూటాన్ పార్లమెంటు కు ఏవిధమైన సహకారాన్నైనా అందిస్తామని, 'రూల్ ఆఫ్ లా' ధృఢంగా కట్టుబడి ఉండటం అత్యంత ఆవశ్యకమైన విషయమని వివరిస్తూ తన ప్రసంగాన్ని ముగించారు.












Click it and Unblock the Notifications