కర్నూలులో ఫ్యాక్షన్ హత్యలు: 9 మంది మృతి
కర్నూలు: కర్నూలు జిల్లాలోని ప్రముఖ ఫ్యాక్షన్ నాయకుడు, తెలుగుదేశం నేత కప్పట్రాళ్ళ వెంకటప్ప నాయుడు మరణించారు. కర్నూలుకు 60 కిలోమీటర్ల దూరంలో వెంకటప్ప నాయుడు ప్రయాణిస్తున టాటా సుమోను ప్రత్యర్ధి వర్గానికి చెందిన లారీ ఢో కొట్టడంతో నాయుడుతో పా టు ఆయన అనుచరులు 8 మంది మరణించారు.
మృతుల్లో కప్పట్రాళ్ళ సోదరుడు, ఇద్దరు గన్ మన్లు, డ్రైవర్, బ్యాంకు మేనేజర్ ఉన్నారు. పోలీసులు మాత్రం దీనిని రోడ్డు ప్రమాదం చిత్రీకరిస్తున్నారు. కప్పట్రాళ్ళపై ఇప్పటికే 12 సార్లు ప్రత్యర్ధుల దాడులు జరిగాయి. నాయుడుకు పద్మక్కకు మధ్య చాలాకాలంగా శతృత్వం ఉంది. ఈ నేపధ్యంలో పద్మక్క దాడికి పాల్పడి ఉండవచ్చని తెలుగుదేశమ్ వర్గాలు అనుమానిస్తున్నాయి.












Click it and Unblock the Notifications