రెండు రోజుల్లో మద్దతుపై నిర్ణయం: బిజెపి
కరీంనగర్: ఉప ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతివ్వాలనే విషయంపై రెండు రోజుల్లోగా నిర్ణయం తీసుకుంటామని భారతీయ జనతా పార్టీ (బిజెపి) నాయకుడు సిహెచ్. విద్యాసాగర్ రావు చెప్పారు. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డిని గద్దె దించి రాష్ట్రపతి పాలన విధిస్తేనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమవుతుందని ఆయన అన్నారు.
అన్ని పార్టీల్లోని తెలంగాణవాదులు ఏకమై తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు పోరాడాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని 2009 ఎన్నికల లోపే సాధించడం అవసరమని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్ని సార్లు గెలిచినా తెలంగాణ రాదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications