వైకుంఠం క్యూకాంప్లెక్స్ వద్ద మంటలు

అగ్ని ప్రమాదం ఎలా సంభవించిందనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. నిజానికి, తిరుమల కొండపై సిగరెట్లు తాగడాన్ని నిషేధించారు. ఈ ప్రమాదంతో రెండు గంటల పాటు శ్రీవారి దర్శనాన్ని ఆపేశారు. తిరుమల కొండపై శుక్రవారంనాడు లక్ష నుంచి లక్షా 20 వేల మంది భక్తులుంటారని అంచనా. క్యూల్లో 80 వేల మంది దాకా ఉన్నారు. తిరమల కొండపై ఫైర్ స్టేషన్ ఉంది. దాంట్లో మూడు ఫైరింజన్లు ఉన్నాయి. మంటలను ఆర్పడానికి వాటిని వినియోగించారు. అగ్ని ప్రమాదానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు విమర్శిచారు.












Click it and Unblock the Notifications