ఉప్పల్ మైదానంలో ఐదుగురు అరెస్టు

నకిలీ కేటరింగ్ కార్డులతో వారు మైదానంలోకి ప్రవేశించారు. రేపు సూపర్ కింగ్స్ కు, దక్కన్ చార్జర్స్ కు మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో సూపర్ కింగ్స్ జట్టు సభ్యులు సోమవారం ప్రాక్టీస్ చేయనున్నారు. అదే విధంగా బిసిసిఐ అధ్యక్షుడు శరద్ పవార్ ఉప్పల్ మైదానాన్ని సందర్శిస్తారు. వీటిని దృష్టిలో పెట్టుకుని పోలీసులు ఆ యువకులను అదుపులోకి తీసుకున్నారు. మ్యాచ్ చూడడానికే వచ్చారా, లేదంటే విధ్వంసక చర్యలకు దిగడానికి వచ్చారా అనే కోణం నుంచి పోలీసులు వారిని విచారిస్తున్నారు. భద్రతా కారణాల రీత్యానే వారిని అదుపులోకి తీసుకున్న విషయాన్ని పోలీసులు సోమవారంనాటికి కూడా వెల్లడించలేదు.












Click it and Unblock the Notifications