టిటిడి ఉద్యోగి అస్తులు రు.1.75 కోట్లు
తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి)రికార్డు అసిస్టెంట్ ఇంటిపై అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) అధికారులు జరిపిన దాడిలో కోటీ 75 లక్షల రూపాయలకు పైగా అస్తులు బయటపడ్డాయి. ఎసిబి జాయింట్ డైరెక్టర్ చారు సిన్హా నేతృత్వంలోని ఎసిపి అధికారులు గురువారంనాడు తిరుచనూరు రోడ్డులోని అతని ఇంటిపై దాడులు నిర్వహించారు.
ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే ఆరోపణలు రావడంతో ఎసిబి అధికారులు ఆ టిటిడి ఉద్యోగి ఇంటిపై దాడి చేశారు. బంగారం, నగదు, ఇతర ఆస్తుల విలువ కోటీ 75 లక్షల రూపాయల దాకా ఉంటుందని ఎసిబి అధికారులు అంచనాకు వచ్చారు. అతని బంధువు ఇళ్లపై కూడా ఎసిబి అధికారులు దాడులు నిర్వహించారు.












Click it and Unblock the Notifications