ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతం
హైదరాబాద్: రాష్ట్రంలో గురువారం ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. చెదురమొదురు సంఘటనలు మినహా అవాంఛనీయ సంఘటనలేవీ చోటు చేసుకోలేదు. జూన్ 1వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఉప ఎన్నికల్లో మొత్తం 55 నుంచి 60 శాతం వరకు పోలింగ్ నమోదైనట్లు సమాచారం. ఓటింగ్ ఉదయం మందకొడిగా ప్రారంభమైంది. ఎండ వేడి తగ్గిన తర్వాత సాయంత్రం పూట పుంజుకుంది. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల శాసనసభా నియోజకవర్గంలో అత్యధికంగా 63 శాతం పోలింగ్ నమోదైనట్లు సమాచారం. ఖైరతాబాద్, తెర్లాం నియోజకవర్గాల్లో తక్కువగా పోలింగ్ నమోదైంది. ఖైరతాబాద్ శాసనసభా నియోజకవర్గంలో 35 నుంచి 40 శాతం వరకు పోలింగ్ నమోదయినట్లు సమాచారం.
వరంగల్ జిల్లాలోని ఉప ఎన్నికల్లో 50 శాతం వరకు పోలింగ్ నమోదైనట్లు తెలుస్తోంది. వరంగల్ జిల్లాలో రెండు పార్లమెంటు నియోజకవర్గాలకు కూడా పోలింగ్ జరిగింది. ఆదిలాబాద్ జిల్లాలో 60 నుంచి 62 శాతం పోలింగ్ నమోదైనట్లు సమాచారం. నిజామాబాద్ జిల్లాలో 55 శాతం పోలింగ్ నమోదైనట్లు సమాచారం. రాష్ట్రంలోని 18 శాసనసభా నియోజకవర్గాలకు, నాలుగు లోకసభ నియోజకవర్గాలకు గురువారం పోలింగ్ జరిగింది.












Click it and Unblock the Notifications