పోలీసుల తీరుపై బిజెపి ఫిర్యాదు
హైదరాబాద్: హైదరాబాదులోని ముషీరాబాద్ శాసనసభా నియోజకవర్గంలో గురువారం పోలింగ్ సందర్భంగా పోలీసులు అనుసరించిన తీరుపై భారతీయ జనతా పార్టీ (బిజెపి) నాయకులు ఎన్నికల ప్రదానాధికారి ఐ.వి.సుబ్బారావుకు శుక్రవారం ఫిర్యాదు చేశారు. పోలీసులు ప్రభుత్వ ఏజెంట్లుగా వ్యవహరించి ఓటర్లను భయబ్రాంతులను చేశారని వారు ఆరోపించారు. ఓటు వేయకుండా ప్రజలను అడ్డుకున్నారని వారన్నారు.
అనుమతి ఉన్నా తమ పార్టీ శాసనసభ్యుడు జి. కిషన్ రెడ్డి నియోజకవర్గంలోకి అనుమతించలేదని వారు ఫిర్యాదు చేశారు. పైగా కిషన్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారని వారు చెప్పారు. ఈ విషయమై విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకుంటామని సుబ్బారావు బిజెపి నాయకులకు హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications