నలుగురు మావోయిస్టుల హతం
విశాఖపట్నం: విశాఖపట్నం చింతపల్లి ఏజెన్సీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు హతమయ్యారు. వీరిలో దళ కమాండర్ ఝాన్సీ కూడా ఉన్నట్లు అనుమానిస్తున్నారు. మావోయిస్టులు పేల్సిన మందుపాతరలో గురువారంనాడు ఒక కానిస్టేబుల్ మృతి చెందాడు. మరో కానిస్టేబుల్ శ్రీనివాస్ కూడా కనిపించకుండా పోయాడు. శ్రీనివాస్ మావోయిస్టుల దాడిలో చనిపోయి ఉంటాడని భావించారు. అయితే అతను గాయాలతో పోలీసు స్టేషన్ కు తిరిగి వచ్చాడు.
ఆ సమయంలోనే మరణించిన కానిస్టేబుల్ జరిపిన కాల్పుల్లో నలుగురు నక్సలైట్లు మరణించి ఉంటారని భావిస్తున్నారు. ఎదురుకాల్పులు జరిగిన ప్రదేశానికి మూడు గంటలు కాలినడకన వెళ్లాల్సి ఉంటుంది. మావోయిస్టుల మందుపాతర పేల్చివేత అనంతరం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ గాలింపు చర్యల సందర్భంగా నలుగురు మావోయిస్టుల శవాలు కనిపించాయి. ఈ శవాలను నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలిస్తారు.












Click it and Unblock the Notifications