కడప జిల్లాలో మరో ఫాక్షన్ హత్య
కడప: కడప జిల్లా వేంపల్లి మండలం టి. వెలమవారిపల్లె గ్రామంలో తెలుగుదేశం నాయకుడు రామకృష్ణారెడ్డిని ప్రత్యర్థులు దారుణంగా నరికి చంపారు. గురువారం అర్థరాత్రి దాటిన తర్వాత ఈ హత్య జరిగింది. బయట వాకిట్లో నిద్రిస్తున్న రామకృష్ణా రెడ్డిని ప్రత్యర్థులు వేట కొడవళ్లతో నరికి చంపారు. అడ్డు వచ్చిన రామకృష్ణారెడ్డి భార్యపై కూడా వారు దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురు పాల్గొన్నట్లు సమాచారం.
గతంలో ఎంపిటిసిగా పోటీ చేసిన రామకృష్ణారెడ్డి తెలుగుదేశం నాయకుడు కందుల శివానందరెడ్డికి బంధువు. వ్యాపార లావాదేవీలే ఈ హత్యకు కారణమని భావిస్తున్నారు. పాతకక్షలేమైనా ఉన్నాయా అనే కోణం నుంచి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.












Click it and Unblock the Notifications