గుజ్జర్లు-పోలీసుల మద్య ఘర్షణలో ముగ్గురి మృతి
జైపూర్: తమను ఎస్టీ కేటగిరి లో చేర్చాలని పోరాడుతున్న గుజ్జర్లకు పోలీసులకు నేడు జరిగిన ఘర్షణలో ముగ్గురు వ్యక్తులు మరణించారు. జైపూర్ కి 170 కిలో మీటర్ల దూరంలో ఉన్న సవాయ్ మధోపూర్ జిల్లాలో ఈ అవాంచనీయ సంఘటన చోటుచేసుకుంది. మృతుల్లో ఒక పోలీసు కూడా ఉన్నారు."కొందరు గుజ్జర్లు రోడ్డుపై ట్రాఫిక్ కి అంతరాయం కలిగించాలని బైఠాయించినప్పుడు పోలీసులు జోక్యం చేసుకోవలసి వచ్చింది. జనసమూహాన్ని చెదరగొట్టడానికి పోలీసులు ప్రయత్నించినప్పుడు వారు పోలీసులపై రాళ్ళు విసిరారు. పోలీసులు బాష్పవాయువును ప్రయోగించినా ఫలితం లేకపోవడంతో కాల్పులు జరపక తప్పలేదని" భరత్ పూర్ ఇన్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఉమేశ్ మిశ్రా వివరించారు.












Click it and Unblock the Notifications